E.G: వినాయక చవితి సందర్భంగా రాజమండ్రి నగరంలోని తారకరామ నగర్ గణపతిని ఎమ్మెల్సీ సోము వీర్రాజు బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, ఎటువంటి విఘ్నాలు లేకుండా ఎన్డీయే పాలన సాగాలని గణపతిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ఉత్సవ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.