TG: భారీ వర్షాలపై ప్రభుత్వం వెంటనే సమీక్ష నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వాగుల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు.. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు పక్కనపెట్టి.. ప్రజల ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు.