VSP: మంత్రి నారా లోకేష్ మూడు రోజుల పర్యటనకు గురువారం విశాఖ రానున్నారు. విశాఖ టీడీపీ కార్యాలయంలోనే బస చేస్తూ పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా మూడు రోజులపాటు విశాఖలో పర్యటించనున్నారు. ఆగస్టు 29న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ విశాఖలో వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొంటారు.