ప్రకాశం: పొదిలిలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో గణేశ్ ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా బుధవారం సీఐ టి. వెంకటేశ్వర్లు కుటుంబ సమేతంగా ఉత్సవాల్లో పాల్గొని, స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలను అందజేసి, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.