MBNR: రాబోయే రెండు మూడు రోజులు మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. వినాయక మండపాల వద్ద వర్షం కురిసే సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని అందువల్ల ట్రాన్స్ఫార్మర్ల వద్దకు విద్యుత్ స్తంభాల వద్దకు ప్రజలు వెళ్లకూడదని అన్నారు.