KMR: ఎల్లారెడ్డి మండలం అన్నాసాగర్ వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అన్నసాగర్ శివారులో జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయి. అయితే వరద ఒక్కసారిగా ముంచెత్తడంతో పనుల్లో భాగంగా అక్కడ బిహారీ కూలీలు వరదలో చిక్కుకున్నారు. ఇది వరకే నలుగురిని కాపాడగా, తాజాగా మరో ఐదుగురిని విపత్తు నిర్వహణ బృందాలు బృందాలు ఒడ్డుకు చేర్చాయి.