BPT: అద్దంకిలో ఇద్దరు యువకులు మంగళవారం హల్చల్ చేశారు. తమ ద్విచక్ర వాహనానికి పంచర్ పడటంతో కామటేశ్వర దేవాలయం ఎదురుగా ఉన్న ఓ పంచర్ షాప్ వద్ద పంచర్ వేయించుకున్నారు. పంచర్ వేసి డబ్బులు అడిగిన అనిల్‌పై దాడి చేశారు. వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దాడికి పాల్పడిన యువతకు 20 సంవత్సరాల వయసు ఉంటుందని, వీరు మద్యం మత్తులో ఉన్నట్లు తెలిపారు.