W.G: భీమవరంలో కలెక్టరేట్ తరలింపుపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కలెక్టరేట్‌ను ఉండి నియోజకవర్గం కాళ్ల మండలం పెదమిరంకు తరలించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. దీనిపై పలువురు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. భీమవరం జిల్లాకు కలెక్టరేట్ కేంద్ర బిందువుగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.