SRPT: విఘ్నాలు తొలగి అంతా మంచే జరగాలని కోరుతూ గణపతి విగ్రహాలను సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టిస్తున్నారు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి సందడి మొదలైంది. ఈ క్రమంలో నిర్వాహకులు నిరంతరం అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. విగ్రహాలు తరలించేటప్పుడు, విద్యుత్ వైర్లతో, మండపాల్లో విద్యుత్ పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.