కోనసీమ: జిల్లాలో నిర్వహిస్తున్న రీసర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. మంగళవారం సాయంత్రం మూడు డివిజన్ల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామాల్లో అత్యంత ఖచ్చితత్వంతో కూడిన సర్వే చేపట్టాలన్నారు. పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు.