కోనసీమ: రామచంద్రపురం పట్టణంలోని శ్రీరాజా ఎయిడెడ్ అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఖాళీగా ఉన్న స్కూల్ అసిస్టెంట్, తెలుగు భాషా పండిట్, రెండు సెకండరీ గ్రేడ్ టీచర్ (SGT) పోస్టుల భర్తీకి అర్హతగల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాశాఖాధికారి టి.వీరరాఘవరెడ్డి తెలిపారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు MEO కార్యాలయంలో సెప్టెంబరు 3వ తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు.