HYD: ఉప్పుగూడ పరిధిలోని రక్షాపురం కాలనీ శ్రీ శివాలయం ఆలయ ప్రాంగణంలో బుధవారం తాత్కాలిక నీటి కొలను ఏర్పాటు చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో భక్తుల రద్దీని, జల కాలుష్యాన్ని నివారించేందుకు రక్షాపురం చుట్టు పక్కల బస్తీ వాసుల సౌకర్యార్థం, గణేశ విగ్రహాల నిమజ్జనానికి తాత్కాలిక నీటి కొలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.