KNR: తిమ్మాపూర్ మండలకేంద్రంలోని 1వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందంటూ కాలనీ వాసులు బుధవారం ఆందోళనకు దిగారు. మురికినీరు వెళ్లకుండా కొందరు వ్యక్తులు కాలువను మట్టితో నింపారని ఆరోపించారు. దీంతో కంపు వాసన రావడమే కాకుండా దోమలు విజృంభిస్తున్నాయని.. వారు ఆవేదన చెందుతున్నారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదుచేస్తే పట్టించుకోవడం లేదన్నారు.