ATP: గుత్తి ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో బుధవారం మిలాద్-ఉన్-నబి వేడుకలపై ముస్లిమ్స్ మత పెద్దలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధ్యక్షుడు SMD రియాజ్ మాట్లాడుతూ.. సెప్టెంబర్ 5న జరిగే మిలాద్-ఉన్-నబి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ముస్లిం మైనారిటీ సోదర, సోదరీమణులు తప్పక పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు.