BHNG: యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకాన్ని పరిశీలించాలని అధికారులకు జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 28, 29 తేదీలలో ఎంపిక చేయబడిన అధికారులు ఆయా పాఠశాలలను సందర్శించి, చెక్ లిస్టులో నమోదు చేయాలని సూచించారు. అనంతరం ఆ చెక్ లిస్టులను జిల్లా కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు.