JGL: రాయికల్ మండలం అల్లీపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థిని అనూష రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. మహబూబ్ నగర్లో ఈనెల 30, 31వ తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు విద్యార్థిని అనూష ఎంపికైనట్లు హెచ్ఎం కిరణ్ ఈరోజు తెలిపారు. ఇటీవల జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో షాట్ పుట్ విభాగంలో ప్రథమ స్థానం పొందినట్టు తెలిపారు.