తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి శోభ అంబరాన్ని తాకింది. వాడవాడలా రంగురంగుల మండపాలు, భారీ గణనాథుడి విగ్రహాలు భక్తులను ఆకర్షిస్తున్నాయి. ఈ ఏడాది పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన పెరగడంతో, మట్టి విగ్రహాలను అధికంగా ప్రతిష్ఠిస్తున్నారు. మండపాల్లో కొలువుదీరిన వినాయకులు భక్తుల సందర్శనానికి సిద్ధంగా ఉన్నారు. భక్తి గీతాలు, ప్రత్యేక పూజలతో పండుగ వాతావరణం నెలకొంది.