SKLM: వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని లావేరు ఎస్సై లక్ష్మణరావు అన్నారు. మంగళవారం రాత్రి మండలంలోని పలు గ్రామాల్లో ఆయన వినాయక మండపాలను పరిశీలించారు. అగ్నిప్రమాదాలు జరగకుండా విద్యుత్ దీపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని, విగ్రహం ఎత్తు, బరువు ఉత్సవం రోజులు, నిమజ్జన మార్గం వివరాలను ముందుగానే పోలీసులకు తెలియ జేయాలన్నారు.