KMR: కామారెడ్డిలోని ఏరియా ఆసుపత్రి వద్ద 108 అంబులెన్స్‌ని రాష్ట్ర క్వాలిటీ సెల్ అధికారి కిషోర్ మంగళవారం తనిఖీ చేశారు. అంబులెన్స్‌లో ఉన్న వసతులను ఆయన పరిశీలించారు. ప్రతి రోజు ఎన్ని కేసులను ఆసుపత్రికి తరలిస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలు అందించాలని సూచించారు.