VZM: భారీ వర్షాల పట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమంగా ఉండాలని కలెక్టర్ అంబేద్కర్ ఆదేశించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా యంత్రాంగం అన్ని రకాల ముందు జాగ్రత్త చర్యలను తీసుకోవాలని, ఎక్కడా ఎటువంటి నష్టం జరగకుండా చూడాలన్నారు.