MNCL: బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో పట్టణంలోని అన్ని గణేష్ మండప ఇన్ఛార్జీలతో మంగళవారం సమన్వయ సమావేశం నిర్వహించారు. కమిషనర్ రమేష్ మాట్లాడుతూ.. మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గణేష్ చవితి ప్రారంభం నుంచి నిమజ్జనం పూర్తయ్యే వరకు నిబంధనలను పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలన్నారు.