కృష్ణా: రాష్ట్రవ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డులను అందిస్తున్నట్లు ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం అవనిగడ్డలో రెవిన్యూ శాఖ ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డుదారులకు నూతన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చే నెల 15వరకు స్మార్ట్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు.