W.G: ఆచంటలోని పెనుమంచిలి, భీమలాపురం, కోడేరు, కొడమంచిలి, వల్లూరు, పెదమల్లం ప్రాంతాల్లో వేకువ జాము నుంచి చిరుజల్లులతో కూడిన వర్షం కురుస్తోంది. దీంతో ఉదయం వేళ వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు ఇబ్బందులకు గురయ్యారు. పలు ప్రాంతాల్లో రహదారులపై ఏర్పడ్డ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడంతో వాహనదారులు అవస్థలు పడ్డుతున్నామని తెలిపారు.