NLG: నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను ఆదివారం సాయంత్రం కనగల్ పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై రాజీవ్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బొల్మేపల్లికి చెందిన తాటికొండ నాగరాజు, తాటికొండ యాదయ్యలు అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలిస్తూ పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు చూసి ట్రాక్టర్లు వదిలి పారిపోయారు. డాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు.