W.G: కొండుప్రోలులో మంచినీరు, స్మశాన వాటిక సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జనసేన నాయకుడు పైబోయిన వెంకటరామయ్య తెలిపారు. తాడేపల్లిగూడెం మండలం కొండ్రుప్రోలు గ్రామస్థులు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఆయన సూచనల మేరకు ఆదివారం వెంకటరామయ్య గ్రామస్థులతో మాట్లాడారు. ట్యాంకర్ ద్వారా మంచినీరు సరఫరాకు ఏర్పాట్లు చేస్తామన్నారు.