MNCL: జన్నారం మండలంలోని భంగ్యా నాయక్ తండా గ్రామ శివారులో ఉన్న కెనాల్లో పడి ఒక వ్యక్తి మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఆ గ్రామానికి చెందిన బి. గంగాధర్ బుధవారం రాత్రి పనిని ముగించుకుని తిరిగి వచ్చే సమయంలో కెనాల్లో పడి మృతి చెందినట్లు వారు తెలిపారు. గంగాధర్‌కు భార్య, పిల్లలు ఉన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా అందాల్సి ఉంది.