NGKL: అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ హైదరాబాద్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు, అభివృద్ధి పనులకు నిధులు, అనుమతులు మంజూరు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. స్పందించిన డిప్యూటీ సీఎం అచ్చంపేటలో 220/33 KV సబ్ స్టేషన్ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.