TG: HYDలోని అత్తాపూర్లో వినాయక విగ్రహాన్ని తరలిస్తున్న ట్రాక్టర్కు విద్యుత్ వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గమనించిన యువకులు వెంటనే ట్రాక్టర్ పైనుంచి దూకి ప్రాణాలను దక్కించుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఈ ఘటనలో ట్రాక్టర్, విగ్రహం పాక్షికంగా దెబ్బతిన్నాయి. పండుగ వేళ ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.