SRPT: రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. తెల్లారింది మొదలు యూరియా కోసం పరుగులు పెడుతున్నారు. అనంతగిరి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద, సోమవారం రైతులు తెల్లవారుజామున 5 గంటలకే క్యూ లైన్లో చెప్పులు పెట్టి బారులు తీరారు. యూరియా కొరతతో చిన్నా సన్న కారు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.