TG: సీఎం రేవంత్ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. సీఎం పర్యటనను అడ్డుకుంటామని ఇప్పటికే పలు విద్యార్థి సంఘాలు హెచ్చరించటంతో క్యాంపస్లో పోలీసులు భారీగా మోహరించారు. ఇప్పటికే పలువురు BRSV నేతలను ముందస్తు అరెస్టులు చేశారు. ఓయూ మార్గంలో ఇరువైపులా కంచెలు ఏర్పాటు చేశారు.