ATP: అనంతపురం కలెక్టరేట్లో జరిగిన డీఆర్సీ సమావేశంలో ఎమ్మెల్యే పరిటాల సునీత పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. పేరూరు ప్రాజెక్ట్ పనులు త్వరగా ప్రారంభించాలని కోరారు. భూములు ఇచ్చిన 400 మంది రైతులు ఆరేళ్లుగా పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని, ఇంకా రూ. 50 కోట్లు బకాయి ఉన్నాయని తెలిపారు. అలాగే, హంద్రీనీవా కాలువ ద్వారా గొలుసు కట్టు చెరువులకు నీరు అందించాలన్నారు.