W.G: స్కీం వర్కర్లపై యాప్ పేరుతో ప్రభుత్వం పనిభారం పెంచుతుందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చింతకాయల బాబూరావు దుయ్యబట్టారు. ఆదివారం తాడేపల్లిగూడెం సీఐటీయూ కార్యాలయంలో మండల 2వ మహాసభ నిర్వహించారు. స్కీం వర్కర్లకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యంగా హక్కుల సాధనకు ఉద్యమించాలని పిలుపునిచ్చారు.