టోక్యో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను అహ్మదాబాద్‌లో జరుగుతున్న కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్స్‌లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. మహిళల 48 కిలోల విభాగంలో ఆమె 193 కిలోల బరువు ఎత్తి బంగారు పతకం గెలుచుకుంది. మలేషియా ప్లేయర్ హెన్రీ 167 KGలతో రజత పతకం, వేల్స్ ప్లేయర్ రాబర్ట్స్ 150KGలతో కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు.