RR: షాద్ నగర్ పట్టణంలోని ఐదవ వార్డుకు చెందిన న్యూ టౌన్ షిప్ కాలనీవాసులు సోమవారం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ సమస్యలను ఎమ్మెల్యేకు వివరించారు. సమస్యలు తీర్చాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కాలనీలో నెలకొన్న సమస్యలను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.