ATP: రోడ్లమీద చెత్తను వేస్తే చర్యలు తప్పవని దుకాణాల నిర్వాహకులకు మున్సిపల్ కమిషనర్ నయీమ్ అహమ్మద్ హెచ్చరించారు. గురువారం గుంతకల్లు పట్టణంలోని పలు వార్డుల్లో చేస్తున్న శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. తడి, పొడి, ప్రమాదకర చెత్తను వేరుగా చేసి పారిశుద్ధ్య కార్మికులకు అందించాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.