TG: రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరదల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. ఆదిలాబాద్-తిరుపతి రైళ్లను రద్దు చేయగా, నిజామాబాద్-కాచిగూడ రైలు సర్వీస్ కూడా రద్దయింది. మహబూబ్నగర్-కాచిగూడ, షాద్నగర్-కాచిగూడ సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని సూచించారు.