HYD: ఖైరతాబాద్ గణేష్ మండపం వద్ద గురువారం భక్తుల రద్దీ కొనసాగుతోంది. సమయం గడిచేకొద్దీ భక్తుల తాకిడి పెరుగుతుండటంతో, వర్షాన్ని కూడా లెక్కచేయకుండా భక్తులను ఒకేసారి దర్శనం చేయించి, రోప్‌ల సహాయంతో పోలీసులు రద్దీని నియంత్రిస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డీసీపీ శిల్పవల్లి స్వయంగా బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.