GNTR: పొన్నూరు రోడ్‌లోని టీడీపీ కార్యాలయానికి బుధవారం రాష్ట్ర మైనారిటీ వ్యవహారాల సలహాదారు ఎం.ఏ. షరీఫ్ విచ్చేశారు. ఈ సందర్భంగా మైనారిటీ విద్యార్థుల భవిష్యత్తు, విద్యావకాశాల అభివృద్ధి, ఉర్దూ టీచర్ల నియామకం, కడపలో హజ్‌హౌస్ నిర్మాణం వంటి పలు కీలక అంశాలపై ఎమ్మెల్యే మహమ్మద్ నసీర్తో చర్చించారు. ఈ భేటీలో ఆయన మాట్లాడుతూ.. ముస్లిం మైనారిటీల విద్యా ,సంక్షేమం కోసం నిశ్చయమైన కృషి చేస్తామన్నారు.