సిద్దిపేటలో గణేష్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పక పాటించాలని ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ కోరారు. ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలన్నారు. రోడ్డుకు ఇబ్బంది కలగని విధంగా సురక్షితమైన ప్రదేశాల్లోనే గణేష్ విగ్రహాలు, మండపాలను ఏర్పాటు చేయాలని సూచించారు. రద్దీ ప్రాంతాల్లో మండపాలను ఏర్పాటు చేయోద్దని ఆయన స్పష్టం చేశారు.