TG: టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ దొంగ ఓట్లు ఉన్నాయని అన్నారు. దొంగ ఓట్లతోనే 8 మంది బీజేపీ ఎంపీలు గెలిచారని ఆరోపించారు. దొంగ ఓట్లు లేకపోతే బండి సంజయ్ గెలిచేవారు కాదని పేర్కొన్నారు. బీజేపీ ఒక్క ఎంపీ సీటు కూడా గెలిచేది కాదంటూ విమర్శించారు.