ప్రముఖ నటి తమన్నా నటించిన కొత్త వెబ్‌సిరీస్ ‘డు యూ వనా పార్ట్నర్’. నిషాంత్ నాయక్, గంగోపాధ్యాయ తెరకెక్కించారు. ప్రముఖ ఓటీటీ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ రూపొందించింది. తాజాగా, విడుదల తేదీ ఖరారైంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ కామెడీ, డ్రామా వెబ్‌సిరీస్‌లో బాలీవుడ్ నటి డయానా పెంటీ మరో కీలకపాత్ర పోషించారు.