ATP: వెరిఫికేషన్ పేరుతో అక్రమంగా తొలగించిన వికలాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ బుక్కరాయసముద్రం మండలంలో వికలాంగులు భారీగా తరలివచ్చి రోడ్డుపై ధర్నా నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అర్హులైన వారిని అన్యాయంగా తొలగించడంపై ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వం వెంటనే సరైన వారికి పింఛన్లు మంజూరు చేయాలని కోరారు.