NZB: ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ర్యాగింగ్‌కు పాల్పడిన ఐదుగురు మెడికోలను ఆరు నెలల పాటు సస్పెండ్ చేసి, హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగించారు. కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్. కృష్ణ మోహన్ అధ్యక్షతన సోమవారం యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇరువర్గాల వాదనలు విని జూడా సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.