W.G: భీమవరం పర్యటనలో ఉన్న ప్రముఖ ఆక్వా ఎక్స్పోర్టర్, రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు సోమవారం కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మను వారి నివాసంలో కలిశారు. పలువురు ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు సమావేశమై రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. అమెరికా విధించిన టారిఫ్ వల్ల మన రైతులకు నష్టం ఉండకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందన్నారు.