KMM: ఖమ్మం జలజ టౌన్షిప్లోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను ప్రభుత్వ ఉద్యోగులకు లాటరీ పద్ధతిలో కేటాయించనున్నట్లు కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సోమవారం తెలిపారు. ఆసక్తిగల ఉద్యోగులు ఆగస్టు 30లోపు రూ. 2 లక్షలు చెల్లించి పేర్లను నమోదు చేసుకోవాలని సూచించారు. 8 టవర్లలోని 576 ఫ్లాట్లు ఉన్నాయి. చదరపు గజానికి రూ.1,150 ధరగా నిర్ణయించారు.