సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘కూలీ’ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకుపైగా కలెక్షన్లు రాబట్టినట్లు సినీవర్గాలు తెలిపాయి. విడుదలైన 12 రోజుల్లోనే ఈ ఘనత సాధించినట్లు పేర్కొన్నాయి. మరోవైపు Jr. NTR, హృతిక్ నటించి ‘వార్-2’ ప్రపంచవ్యాప్తంగా రూ.327 కోట్లకుపైగా వసూలు చేసినట్లు వెల్లడించాయి. తెలుగులో ఈ మూవీ రూ.62.10 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని తెలిపాయి.