కృష్ణా: శ్రద్ధ క్రమశిక్షణతో ఉన్నతంగా ఎదగాలని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. మంగళవారం చల్లపల్లిలో వివేకానంద డిగ్రీ, విజయ జూనియర్ కళాశాలల విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముఖ్య అతిధి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ ద్వారా అందుబాటులోకి వచ్చిన విజ్ఞాన సర్వస్వాన్ని వినియోగించి ఉన్నత అవకాశాలు అందుకోవాలని సూచించారు.