CTR: కార్వేటినగరం మండలం, ఆలత్తూరు గ్రామంలో వున్న పురాతన ముత్యాలమ్మ ఆలయం మరమ్మతులు చేయడానికి బాలాలయ పూజలు చేశారు. ఈ మేరకు వేద పండితులు రూపేష్ క్రిష్ణ ఆచార్య కలశ పూజ, హోమం జరిపి అమ్మవారికి పంచామృతములతో అభిషేకం చేశారు. అనంతరం శాస్త్రోక్తంగా విగ్రహన్ని బయటకు తీశారు. కాగా, గీతామందిర ఆశ్రమ పీఠాధిపతి శ్రీ పుండరీక వరదానంద స్వామి భక్తులను ఆశీర్వదించారు.