GNTR: అనారోగ్యంతో బాధపడుతున్న మంగళగిరి మండలం పెదవడ్లపూడి కి చెందిన ముసునూరి గోపాలరావు కుటుంబానికి మంత్రి నారా లోకేష్ చొరవతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 4,50,000 విలువైన ఎల్వోసీ మంజూరైంది. ఈ మేరకు చెక్కును టీడీపీ నాయకులు మంగళవారం గోపాలరావు ఇంటికే వెళ్లి అందజేశారు. మంత్రి నారా లోకేష్‌కి గోపాలరావు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.