GNTR: భూగర్భ జలవనరులను పెంపొందించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఇందుకోసం జలవనరులు, గ్రామీణ నీటిపారుదల, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ శాఖల సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని ఆమె ఆదేశించారు. సోమవారం భూగర్భ జలవనరుల పరిరక్షణ, ఈపీటీఎస్, స్వామిత్వా, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కార్యక్రమాలపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.